
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఆహార భద్రతకు ముప్పుకలిగించేలా ఉన్నాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలు దేశ ఆసక్తికి అనుకూలంగా లేవని విమర్శించారు. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాని డిమాండ్ చేస్తున్న రైతులకు మద్దతుగా ఉన్న 25కుపైగా ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను బుధవారం కలిశారు. ఈ సందర్భంగా కేంద్రం తీరును సీతారం ఏచూరీ తప్పుపట్టారు.