బస్సు నడిపి రికార్డుల్లోకెక్కిన మహిళ

జమ్మ కాశ్మీర్ లో ఓ మహిళ బస్సు నడిపి రికార్డుల్లోకెక్కింది. భారీ వాహనాలు నడపడం పురుషులకేనా..? మహిళలు కూడా డ్రైవ్ చేయగలరంటూ నిరూపించింది. జమ్మూకాశ్మీర్ లోని సందర్-బసోహ్లీ గ్రామానికి చెందిన పూజాదేవి తాజాగా ఓ ప్రైవేట్ బస్సు నడిపింది. హిమాచల్ ప్రదేశ్ లోని కథువా నుంచి జమ్మూకు బస్సును నడిపి ఫీట్ సాధించిన తొలి మహిళగా రికార్డుల్లోకెక్కింది. ఇద్దరు పిల్లలను పోషిస్తున్న పూజాదేవి బస్సు నడిపిన వీడియో వైరల్ అవుతోంది. అంతేకాకుండా మహిళా లోకం తమకు సాధ్యం […]

Written By: Suresh, Updated On : December 26, 2020 4:00 pm
Follow us on

జమ్మ కాశ్మీర్ లో ఓ మహిళ బస్సు నడిపి రికార్డుల్లోకెక్కింది. భారీ వాహనాలు నడపడం పురుషులకేనా..? మహిళలు కూడా డ్రైవ్ చేయగలరంటూ నిరూపించింది. జమ్మూకాశ్మీర్ లోని సందర్-బసోహ్లీ గ్రామానికి చెందిన పూజాదేవి తాజాగా ఓ ప్రైవేట్ బస్సు నడిపింది. హిమాచల్ ప్రదేశ్ లోని కథువా నుంచి జమ్మూకు బస్సును నడిపి ఫీట్ సాధించిన తొలి మహిళగా రికార్డుల్లోకెక్కింది. ఇద్దరు పిల్లలను పోషిస్తున్న పూజాదేవి బస్సు నడిపిన వీడియో వైరల్ అవుతోంది. అంతేకాకుండా మహిళా లోకం తమకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదని పూజదేవీ నిరూపించిందని ప్రశంసిస్తున్నారు.