https://oktelugu.com/

వీహెచ్ వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్?

తెలంగాణలో బలహీనంగా మారిన కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడినపెట్టేందుకు అధిష్టానం తీవ్రంగా యత్నిస్తోంది. రెండేళ్లుగా అధిష్టానం పీసీసీని మార్చాలని భావిస్తున్నా అనివార్య కారణాలతో వాయిదాపడుతూ వస్తోంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త పీసీసీ చీఫ్ నియామకం అనివార్యమైంది. ఈ పదవీ కోసం సీనియర్లు పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నాయి. Also Read: దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ కోర్సులు నేర్చుకునే ఛాన్స్.? పీసీసీ చీఫ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 26, 2020 8:08 pm
    Follow us on

    తెలంగాణలో బలహీనంగా మారిన కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడినపెట్టేందుకు అధిష్టానం తీవ్రంగా యత్నిస్తోంది. రెండేళ్లుగా అధిష్టానం పీసీసీని మార్చాలని భావిస్తున్నా అనివార్య కారణాలతో వాయిదాపడుతూ వస్తోంది.

    అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త పీసీసీ చీఫ్ నియామకం అనివార్యమైంది. ఈ పదవీ కోసం సీనియర్లు పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నాయి.

    Also Read: దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ కోర్సులు నేర్చుకునే ఛాన్స్.?

    పీసీసీ చీఫ్ పదవీని అధిష్టానం రేవంత్ కు కట్టబెడుతుందనే ప్రచారం జోరుగా జరుగుతుండటంతో కాంగ్రెస్ లోని సీనియర్లంతా ఒకటవుతున్నారు. రేవంత్ కు వ్యతిరేకంగా గళంవిప్పుతూ అధిష్టానంపై ధిక్కార స్వరం విన్పిస్తున్నారు.

    ఈక్రమంలో వీహెచ్ హన్మంతరావు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ పై పలు ఆరోపణలు గుప్పించారు. ఠాకూర్ అభిప్రాయ సేకరణ సరిగ్గా నిర్వహించకుండా అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Also Read: అలిగినోళ్లందరికీ పార్టీ పదవులు..: అసంతృప్తులకు కాంగ్రెస్‌ బుజ్జగింపులు

    అంతేకాకుండా రేవంత్ కు పీసీసీ ఇస్తే తాను పార్టీ రాజీనామా చేస్తానంటూ వ్యాఖ్యానించాడు. వీహెచ్ వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్ గా తీసుకుందనే టాక్ విన్పిస్తోంది.

    ఈమేరకు వీహెచ్ కు అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా  చర్యలు తప్పవని హెచ్చరించేందుకే వీహెచ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    Tags