
ఆస్ట్రేలియాతో టీమిండియా రెండో టెస్టు శనివారం సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ను భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. తొలి సెషన్ పూర్తయ్యేసరికి స్పిన్నర్ అశ్విన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. దీంతో మాథ్యూవేడ్, స్టీవ్ స్మిత్ లు ఔటయ్యారు. అంతకుముందు జో బర్న్ ను ఒక్క పరుగు చేయకుండానే బుమ్రా ఔట్ చేశాడు. ప్రస్తుతం లబుషేన్, ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నారు. 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్ కష్టాల్లో పడింది. అయితే లబుషేన్, హెడ్ లు మాత్రం తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు.