
దేశంలో కోవిడ్ -19 కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను మరోసారి పొడిగిస్తు నిర్ణయం తీసుకుంది. జనవరి 31వరకూ కరోనా మార్గదర్శకాలు అమలులో ఉంటాయని కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాష్ట్రాలు,కేంద్రపాలిత స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న నిబంధనలే జనవరి 31వరకు వర్తిస్తాయని పునర్ధుఘాటించింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికి.. ప్రపంచ వ్యాప్తంగా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఈ నిబంధనలు అమలు చేసినట్లు స్పష్టం చేసింది. బ్రిటన్‌లో కలకలం సృష్టించిన కరోనా స్ట్రెయిన్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు పేర్కొంది.