NITI Aayog report: తెలంగాణ రాష్ట్రము మరొక ఘనత సాధించింది. ఆరోగ్య సూచికలోతెలీనంగానే రాష్ట్రం టాప్ లో నిలిచింది. గత సంవత్సరంతో పోలిస్తే మరొక అడుగు ముందుకు వేసింది తెలంగాణ. 2019-20 ఏడాదికి గాను మరొక రాంక్ సాధించి టాప్ లో నిలిచింది. ఈ రోజు నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిని విడుదల చేసింది. 2018-19 ఏడాదికి గాను తెలంగాణ 4వ స్థానాల్లో నిలవగా, 2019-20 ఏడాదికి మూడవ స్థానంలో నిలిచింది.

2019-20 ఏడాదికి సంబంధించిన 4వ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ ను నీతి ఆయోగ్ సోమవారం నాడు రిలీజ్ చేసింది. ఇందులో కేరళ ప్రధమ స్థానంలో నిలవగా, తమిళనాడు రెండవ స్థానంలో, మూడవ స్థానంలో తెలంగాణ కాగా నాలుగవ స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ నిలిచింది. వైద్య వసతుల్లో వరుసగా కేరళ నాలగవ సారి అగ్ర స్థానంలో నిలిచింది. కేంద్ర పాలిత ప్రాంతాల విభాగంలో ఢీల్లీ, జమ్మూకాశ్మీర్ ముందు ఉన్నాయి. ప్రోత్సాహక నమోదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ అగ్ర బాగాన నిలిచింది.
Also Read: Bandi Sanjay: బండి సంజయ్ కు చిక్కులు.. మొన్న పాదయాత్ర, ఇప్పుడు నిరుద్యోగ దీక్షలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హాస్పిటల్స్ ను బలోపేతం చేస్తున్న సందర్భంలో అన్ని ప్రభుత్వం ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తూ, నాణ్యమైన వైద్యం పేద ప్రజలకు అందేలా చేయడానికి కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని అందుకే ఇలాంటి ర్యంకులు వస్తున్నాయని అధికార పార్టీ నాయకులూ చెబుతున్నారు.
ఇక తెలంగాణ లో ఓమోక్రాన్ కేసుల నేపథ్యంలో మూడవ దోసుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా మూడు కోట్ల బూస్టర్ డోసులు ఇచ్చేందుకు సన్నద్ధం అవుతుండడంతో తెలంగాణ లో 60 సంవత్సరాల పైబడిన వారికీ మూడవ డోసును ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికి బూస్టర్ డోసులు ఇవ్వనున్నట్టు సమాచారం.. కోరిన రెండవ డోసు వేసుకున్న నెలరోజుల తర్వాత కానీ మూడవ డోసు వేసేందుకు అవకాశం ఉందని వైద్య అధికారులు చెబుతున్నారు.
Also Read: Telangana: తెలంగాణకు 9, ఏపీకి 10.. సుపరిపాలనలో రెండు స్టేట్లకు ఆసక్తికరమైన సూచీలు