
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణను బీజేపీ నేత, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఆరోపించారు. పత్రాలు, సాక్షులపై సుబ్రహ్మణ్యస్వామి చేసిన దరఖాస్తు అస్పష్టంగా ఉందని పేర్కొంటూ ఢిల్లీ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు వివరించారు. నిబంధనల మేరకు నివేదిక లేనందున రద్దు చేయాల్సిందిగా కోరారు. కాగా తమ కక్షిదారు పత్రాలు కోరే హక్కు తమకు ఉందని సుబ్రహ్మణ్యస్వామి తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను న్యాయస్థానం జనవరి 12వ తేదీకి వాయిదా వేసింది.