
ఒడిశాలోని ప్రముఖ పూరి జగన్నాథుని ఆలయంలో నేటి నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. కరోనా కారణంగా మార్చి నుంచి ఆలయంలోనికి భక్తులను అనుమతించడం లేదు. ఆలయంలోకి భక్తులను అనుమతించనున్న నేపథ్యంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు పరుస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. మొదట స్థానిక భక్తులను దర్శనాలకు అనుమతిస్తామన్నారు. అలాగే నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1,2 తేదీల్లో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఆ రెండు రోజుల్లో ఆలయాన్ని మూసి ఉంచుతామని వారు తెలిపారు. కేవలం సేవకులను మాత్రమే అనుమతిస్తామని వెల్లడించారు. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి ఎక్కువ సంఖ్యలో ఆలయ సేవకులు కరోనా బారిన పడుతున్నారు.