
కరోనా విలయ తాండవం చేస్తోంది. ఈ వైరస్ వర్గ విభేదాలు లేకండా అందరినీ కలిచి వేస్తోంది. ముఖ్యంగా ప్రజల్లో తిరిగే ప్రజాప్రతినిధులను విడిచిపెట్టడం లేదు. తాజాగ ఒడిశా రాష్ట్రంలోని 11మంది ఎమ్మెల్యేలకు కరోనా నిర్దారణ అయింది. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు కానున్న సందర్భంగా ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ పరీక్షల్లో 11 మంది ఎమ్మెల్యేలకు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఇందులో డిప్యూటీ స్పీకర్ కూడా ఉండడం విశేషం. వీరంతా ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.ఇప్పటికే అధికారంలో ఉన్న 9 మంది మంత్రులు, 50 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకి కోలుకున్నారు.
Also Read: అసోం మొదటి మహిళా సీఎం మృతి.