
రాజ్యసభలో ఖాళీగా ఉన్న 11 స్థానాలకు నవరబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రకటించింది. ఈనెల 27న నామినేషన్లకు తుది గడువుగా నిర్ణయించింది. అలాగే నవంబర్ 2వ తేదీ లోపు నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని సూచించింది. ఉత్తరప్రదేశ్‌లోని 10 స్థానాలు, ఉత్తరాఖండ్‌లో ఒక స్థానానికి రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను అనుసరించి నామినేషన్లు వేసుకోవాలని ఈసీ తెలిపింది. అలాగే భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ చేసుకోవాలని ప్రకటించింది.