
తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి 138వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన అంతర్జాతీయ భారతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. చెన్నైలోని వాసవిల్ సాంస్కృతిక కేంద్రంలో ఈ ఉత్సవాలు ఇవాళ జరుగుతున్నాయి. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల్లో సేవలందించినవారికి ప్రధాని మోదీ భారతి అవార్డులను ప్రదానం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.