
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు పూర్తి స్థాయిలో సన్నదమవుతున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. మంగళవారం సిడ్ని వేదికగా జరిగిన మూడో టీ-20 మ్యాచ్‌లో భారత్ ఓడినా 2-1తో తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. లక్ష్యాన్ని చేధించే క్రమంలో టాప్ ఆర్డర్ రాణించినప్పటికి మిడిల్ ఆర్డర్ విఫలమైందని తెలిపాడు. చివర్లో హర్థిక్ భారీ షాట్లు ఆడడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నాడు.