
అద్భుతమైన రామ మందిరాన్ని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య వేదికగా ఘనంగా నిర్మించనున్నారు. ఈ మేరకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి మంగళవారం వెల్లడించారు. అయోధ్యలో ట్రస్టు సభ్యులు రెండ్రోజుల పాటు మీటింగ్ హాజరై తుది నిర్ణయం తీసుకున్నారు. లార్సెన్ అండ్ టబ్రో, టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఐఐటీ రూకీ, ఆర్కిటెక్ట్ ఆఫ్ ఆచార్ ధాం టెంపుల్ ఆర్కిటెక్ట్ బ్రహ్మం విహారీ స్వామిలతో పాటు రామ్ టెంపుల్ ఆర్కిటెక్ట్ ఆశిశ్ సోంపూరాలు మీటింగ్ లో పాల్గొన్నారు.