Powerful World: ప్రపంచంలో ప్రస్తుతం ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ కారణంగానే రెండు ప్రపంచ యుద్ధాలు కూడా జరిగాయి. అయితే ఆ యుద్ధాలతో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగింది. కొన్ని తరాల వరకు యుద్ధ ప్రభావం పడింది. ఈ క్రమంలో మరో వరల్డ్ వార్ రాకుండా ప్రపంచ దేశాలన్నీ యూఎన్‌వోను ఏర్పాటు చేసుకున్నాయి. దీని ఆధ్వర్యంలోనే అన్ని దేశాలు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నా.. ఆధిపత్యం కొసం అప్పుడప్పుడూ యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు ప్రపంచంలో శక్తివంతమైన దేశాలుగా ఎదిగేందుకు ఆర్థికంగా, సాంకేతికంగా, ఆయుధాల పరంగా, సైనికంగా బలోపేతం అవుతున్నాయి. తమకు ఉన్న వనరతో ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నాయి. ఇలాంటి పది దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికా..
అమెరికా ప్రపంచం అగ్రరాజ్యంగా కొనసాగుతోంది. టెక్నాలజీ, వనరులు, తక్కువ జనాభా అమెరికాకు అండగా ఉంటున్నాయి. మరోవైపు చిన్న దేశాలపై ఆధిపత్యం కోసం రుణసాయం రూపంలో ఆయా దేశాల్లో పాగా వేస్తోంది. ప్రపంచంలో చాలా దేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తుంది. ఆయుధాల వ్యాపారంలో అగ్రస్థానంలో ఉంది. ఎలాంటి విపత్తలను ఐనా ఎదుర్కొనేందుకు పెట్రో, ఇంధన నిల్వలు విపరీతంగా అమెరికా పెంచుకుంది.
రష్యా..
అమెరికా తర్వాత అత్యంత శక్తివంతమైన దేశం రష్యా. విస్తీర్ణం పరంగా విషాలమైన దేశం ఇది. రష్యా కూడా ఆయుధ వ్యాపారంలో రెండో స్థానంలో ఉంది. అమెరికాతో పోటీ పడే దేశంగా రష్కా గుర్తింపు పొందింది. అమెరికాతో యుద్ధం చేసే దేశం ఏదైనా ఉందటే అది రష్కా అన్న భావన ఉంది. సైకికంగా, సాంకేతికంగా పటిష్టంగా ఉన్న రష్యా ఆయిల్ వ్యాపారంలోనూ దూసుకుపోతోంది. టర్కీపై ఆధిపత్యం కోసం అమెరికా, రష్యా పోటీ పడుతున్నాయి.
చైనా..
అమెరికా, రష్యాకు దీటుగా ఎదుగుతున్న దేశం చైనా. ప్రపంచంలో అత్యంధిక జనాభా ఇక్కడ ఉంది. మానవ సైనిక శక్తి అధికంగా ఉన్న దేశం కూడా చైనా. అమెరికా, రష్యాకు దీటుగా సైనిక శక్తి పెంచుకునేందుకు ఏటా భారీగా బడ్జెట్ కేటాయిస్తోంది. సాంకేతికంగా దూసుకుపోతున్న చైనా పెట్టుబడులను అధికంగా ఆకర్షిస్తోంది. జనాభా ఎక్కువగా ఉన్నా వాణిజ్యపరంగా చైనా దూసుకుపోతూనే ఉంది. దీనికి కారణం అందరిలో కష్టపడే తత్వం ఉండడమే. స్థానిక సాంకేతికత ప్రపంచ దేశాలకూ చౌకగా విస్తరింపజేయడంలో చైనా మొదటి స్థానంలో ఉంది.
ఇండియా..
ప్రపంచంలో శక్తివంతమైన నాలుగో దేశంగా మన ఇండియా గుర్తింపు ఉంది. నాలుగు దశాబ్దాలుగా ఆర్థికంగా అమెరికా, రష్యా, చైనాతో పోటీ పడుతోంది. అభివృద్ధి సాధిస్తోంది. సైనికంగా కూడా భారత్ బలపడుతోంది. అత్యధునిక ఆయుధాలతోపాటు, మానవ సైన్యం అధికంగా ఉన్న దేశంలో భారత్ రెండో స్థానంలో ఉంది. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందేందుకు పెట్టుబడులను విస్తృతంగా ఆహ్వానిస్తోంది. మన దగ్గరి వనరులు పెట్టుబడి దారులకు ఉపయోగకరంగా ఉన్నాయి. వనరుల సంరక్షణకు సైనిక శక్తిని కూడా భారత్ పెంచుకుంటోంది. అయితే ఇక్కడ అధిక జనాభా ఆర్థిక అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది.
జపాన్..
జపాన్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది సాంకేతికత. తర్వాత అనుబాంబు బాధిత దేశం. చిన్న దేశమే అయిన జపాన్ టెక్నాలజీలో అమెరికాకు దీటుగా ఎదగుతోంది. సైన్యం తక్కువ ఉన్నా.. పొరుగున ఉన్న చైనాను కూడా భయపెట్టేలా సాంతికేకతను అభివృద్ధి చేసుకుంది. సబ్‌మెరైన్‌లో జపాన్ టెక్నాలజీ చాలా శక్తివంతమైనది. బుల్లెట్ రైలు, ఆధునిక కారు, యంత్రాలు జపాన్ నుంచే ఉత్పత్తి అవుతాయి.
సౌత్ కొరియా
సౌత్ కొరియా చిన్న దేశమే అయినా పొరుగున ఉన్న నార్త్ కొరియాతో తరచూ యుద్ధం ఎదుర్కొంటోంది. అయినా అభివృద్ధిలో మాత్రం దూసుకుపోతోంది. ఇందుకు సొంత టెక్నాలజీతోపాటు పెట్టుబడులను ఆకర్షిస్తోంది. వైద్య రంగంలో దక్షిణ కొరియా అగ్రస్థానంలో ఉంది. యుద్ధాలను ఎదుర్కొనే సైనిక శక్తిని కూడా పెంపొందించుకుంది. చైనా జపాన్ మధ్య ఉండే ఈ దేశం అభివృద్ధికి స్వయం కృషే కారణం.
ఫ్రాన్స్..
అందమైన దేశంగా గుర్తింపు ఉన్న ఫ్రాన్స్ ఆర్థికంగా కూడా ఎదుగుతోంది. పర్యాటకంగా ఫ్రాన్స్‌కు మంచి గుర్తింపు ఉంది. వెస్ట్ యూరప్‌లో చాలా పెద్ద దేశం, ప్రపంచలో చాలా ప్రాంతాల్లో ప్రాన్స్ భాగాలు ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ ప్రాన్స్ సైన్యం ఉంటుంది. 290 కంటే ఎక్కువ న్యూక్లియర్ బాంబులు ఈదేశంలో ఉన్నాయి. టెక్స్‌టైల్స్ ఎయిర్‌క్రాఫ్ట్, మిషనరీ, కెమికల్, మెటలర్జీ ఫ్రాన్స్ వ్యాణిజ్యంలో కీలకమైంది. నేవీకి ఫ్రాన్స్ ప్రాధాన్యం ఇస్తుంది. సముద్రాలపై మంచి పట్టుంది.
బ్రిటన్..
శతాబ్దాల క్రితం అనేక దేశాలను తన గుప్పిట ఉంచుకున్న ఉంచుకున్న బ్రిటన్.. తర్వాత ఆర్థికంగా వెనుకబడింది. సాంకేతికంగా ప్రపంచంలో శక్తివంతమైన దేశం బ్రిటన్. మొదటి ప్రపంచ యుద్ధం వరకు యూకే పవర్‌ఫుల్ కంట్రీ. సైన్యం తక్కువే అయినా శిక్షణ ఆత్యాధునికంగా ఉంటుంది. దీనికి ఉన్న అతిపెద్ద శక్తి రాయల నేవీ.
జర్మనీ..
ప్రపంచలో అభివృద్ధి చెందిన దేశాల్లో జర్మని ఒకటి. దీనికి 9 దేశాలు సరిహద్దుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్‌లో జన్మనీ జనాభా ఎక్కువ. మాన్యుఫాక్చరింగ్ విభాగంపై ఎక్కువ దృస్టి పెడుతుంది. అక్కడి రోడ్లపై స్పీడ్ లిమిట్ లేకపోవడం ఆ దేశ అభివృద్ధికి చిహ్నం. నావిగేషన్ కోసం నదులను ఉపయోగిస్తుంది. ఆర్థిక అభివృద్ధిలో నదులు కూడా కీలకంగా ఉన్నాయి.
టర్కీ..
ప్రపంచంలో 8వ శక్తివంతమైన దేశం టర్నీ. ఈ కారణంగానే దీనిని శక్తివంతమైన దేశంగా గుర్తించారు. యూరప్, ఆసియాల గేటవేగా ఈ దేశం ఉంది. అమెరికా, రష్యా టర్కీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. ఇది ఆ దేశానికి కొన్నిసార్లు లాభం చేస్తుండగా కొన్నిసార్లు తలనొప్పిగా మారుతోంది. సరిహద్దులు దాటేవారు టర్కీనే ఎంచుకుంటారు.
Also Read: Sammathame Collections: ‘సమ్మతమే’ 11 డేస్ కలెక్షన్స్.. ఫైనల్ రిజల్ట్ ఇదే !
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Powerful world powerful growing countries
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com