
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఓ సముద్రం లాంటి వారని భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయడు అన్నారు. శనివారం సికింద్రాబాద్‌లోని మారియట్ హోటల్‌లో నిర్వహించిన వాజ్‌పేయి సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వాజ్‌పేయితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి లోతైన ఆలోచనలను కొన్నిసార్లు అర్థం చేసుకోవడం చాలాకష్టతరంగా ఉండేదని చెప్పారు. భాష, సాహిత్యం తదితర విషయాల్లో ఆయన ప్రతిభ అమోఘమని కొనియాడారు.