
రైతు సమస్యలను పరిష్కరించకుండా ప్రధాని మోడీ టీవీ ఈవెంట్లకు పరిమితమవుతున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మండిపడ్డారు. రైతులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కొత్త రైతు చట్టాలతో ఎంఎస్‌పి, రాష్ట్ర సేకరణ వ్యవస్థ నీరుగారిపోతుందని, ప్రయివేటు కొనుగోలుదారుల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. రూ.8వేల కోట్ల జీఎస్‌టి బకాయిలతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రూ.85వేల కోట్ల మేరకు కేంద్రం బకాయి పడిందని, నిజంగా అంత ప్రేమే ఉంటే అందులో కొత్తమొత్తమైనా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఎం కిసాన్ యోజన అమలులో బెంగాల్ సహకరిచడం లేదంటూ కేంద్రం చేసిన ఆరోపణలను ట్విటర్ వేదికగా తోసిపుచ్చారు.