Operation Sindoor: బాలాకోట్ ఘటన గుర్తుండే ఉంటుంది. ఆర్మీ వాహనంపై పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటన తర్వాత భారత్ సర్జికల్ స్రైక్ చేసి పాకిస్తాన్ తాట తీసింది. ఈ సమయంలో మన మిగ్ విమానం ఒకటి పాకిస్తాన్‌లో కూలిపోయింది. ఈ సమయంలో మన పైలెట్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్తాన్ పట్టుకుంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన భారత్.. మూడు రోజుల్లో భారత్‌కు తీసుకువచ్చింది. ఇక పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈసారి కూడా పాకిస్తాన్‌ను తుక్కుతుక్క చేసింది. ఇదే సమయంలో పాకిస్తాన్ డ్రోన్‌లు, మిసైల్ దాడి చేసింది. వాటిని మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన యుద్ధ విమానాలను భారత్ కూల్చింది. ముగ్గురు పాక్ పైలెట్లను పట్టుకుంది. ఆపరేషన్ సిందూర్ ముగిసి ఆరు నెలలైనా పైలెట్ల గురించి పాకిస్తాన్ స్పందించడం లేదు.
పహల్గాం ఘటనకు ప్రతీకారం..
పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. ఇదే విన్యాసం పాకిస్తాన్‌కు కఠిన హెచ్చరిక అయింది. బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ సమయంలో వాడిన ధాటినే తిరిగి ప్రదర్శించిన భారత్, ఈసారి సంపూర్ణ సిద్ధతతో ముందడుగు వేసింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్ వైపు నుంచి∙ఒక్క మిసైల్, ఒక డ్రోన్ కూడా భారత ప్రాంతంలోకి ప్రవేశించలేకపోయి వెనుదిరిగాయి. కారణం – భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అత్యాధునిక సాంకేతికతతో సమన్వయంగా పనిచేయడం.
పట్టుబడిన పాక్ పైలెట్లు..
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన మూడు ఫైటర్ జెట్లు కూలిపోయాయి. వాటిని నడిపిన ముగ్గురు పైలట్లు కనిపించడం లేదు. వాస్తవానికి వారు ప్రస్తుతానికి భారత కస్టడీలో ఉన్నారని భద్రతా వర్గాలు సూచిస్తున్నాయి. తాలూకు విచారణ కొనసాగుతున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం అధికారికంగా ఈ విషయంపై పూర్తి మౌనాన్ని పాటిస్తోంది. తమ పైలట్లు అదృశ్యమయ్యారని అంగీకరిస్తే, భారత్ దాడి నిజమని పాకిస్తాన్ అధికారికంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన దాడులు సరైందని ప్రపంచానికి తెలుస్తుంది. దీంతో పాకిస్తాన్ ప్రతిష్ట దెబ్బతింటుంది. దీంతో పాకిస్తాన్ పట్టుబడిన పైలెట్ల గురించి పట్టించుకోవడం లేదు.
ఆపరేషన్ సిందూర్ భారత రక్షణ రంగంలో ఆధునిక సమన్వయానికి సూచిక. పాకిస్తాన్ మౌనంగా ఉండటం ఈ విజయానికి ప్రత్యక్ష నిర్ధరణ. ప్రచారం లేకపోయినా, భారత్ నిలబెట్టుకున్న ఈ విజయంను రక్షణ చరిత్ర గుర్తుంచుకోబోతోంది.