Bagram Air Base India: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌కు మిత్ర దేశాలు, శత్రు దేశాలు ఎవరో స్పష్టత వచ్చింది. అదే సమయంలో మన శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ముఖ్యంగా మన పక్కనే ఉన్న పాకిస్తాన్, చైనా మన సైనిక శక్తి చూసి షాక్ అయ్యాయి. ఇలాంటి తరుణంలో భారత్ కూడా మరింత అప్రమత్తమవుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ను రౌండప్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆఫ్గానిస్తాన్‌తో దోస్తీ చేస్తోంది. ఇది నచ్చని పాకిస్తాన్ ఆఫ్గాన్‌పై వైమానిక దాడి చేసింది. ఇటీవలే సీజ్‌ఫైర్ జరిగింది. ఈ క్రమంలో ఆఫ్గాన్ భారత్‌కు మరింత దగ్గరైంది. ఏకంగా ఆ దేశంలోని కీలక ఎయిర్ బేస్ బగ్రామ్‌ను భారత్‌కు అప్పగించేందుకు స్వయంగా అప్పగించింది. దీంతో భారత్ ఓ గేమ్ చేంజింగ్ వ్యూహం రూపొందించింది. భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ యుద్ధవిమానాలు తజకిస్తాన్‌లోని ఐనీ బేస్ నుంచి ఆఫ్ఘానిస్తాన్‌లోని బగ్రామ్ ఎయిర్‌బేస్‌కు తరలించింది. పాకిస్తాన్‌కు పశ్చిమ వైపు నుంచి ఎటాక్ చేసేలా వ్యూహాత్మకంగా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
తజకిస్తాన్ నుంచి బగ్రామ్ వరకు..
దశాబ్దాలుగా ఇండియా తజకిస్తాన్‌లో రెండు కీలక స్థావరాలను నిర్వహిస్తోంది ఒకటి ఐనీ, రెండోది ఫార్కోర్. ఫార్కోర్‌లో వైద్య సదుపాయాలు, ట్రైనింగ్ బేస్, రక్షణ సహకారం కొనసాగుతున్నాయి. ఐనీ బేస్ భారత వాయుసేనకు తాత్కాలిక నిలయంగా, సుఖోయ్ యూనిట్లకు లాజిస్టిక్ కేంద్రంగా పని చేస్తోంది. అయితే ఇటీవల ఐనీ లీజు ముగిసింది. ఇదే సమయంలో కొత్త వ్యూహం రూపొందించింది. ఐనీ నుంచి వెనక్కి వెళ్ళకూడదని నిర్ణయించిన న్యూఢిల్లీ, ఇప్పుడు ఆ వ్యూహాన్నే ఆఫ్ఘాన్ నేలపై బలంగా అమలు చేస్తోంది.
కీలక వైమానిక స్థావరం బగ్రామ్..
1950ల్లో సోవియట్ సహకారంతో నిర్మించిన ఈ ఎయిర్‌బేస్ కాబూల్‌కు సుమారు 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోల్డ్ వార్ కాలం నుంచి అమెరికా ‘వార్ ఆన్ టెరర్’ దాకా ఇది మధ్య ఆసియా వ్యూహాత్మక కేంద్రంగా నిలిచింది. చరిత్రలో ఐసన్‌హోవర్ నుంచి ట్రంప్ వరకు పలువురు అమెరికా అధ్యక్షులు ఈ స్థావరాన్ని సందర్శించారు. ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చిన తరువాత అతని అవశేషాలను ఇక్కడికి తీసుకెళ్లి అక్కడి నుంచి సముద్రంలో నిమజ్జనం చేశారు.
పాకిస్తాన్ వెన్నులో వణుకు..
తాలిబాన్ పాలన కింద ఉన్న ఆఫ్ఘాన్ ప్రభుత్వం తాజాగా భారత్‌తో మళ్లీ సంబంధాలను బలోపేతం చేస్తోంది. విదేశాంగ మంత్రి అమీర్ అతి ముట్టఖీ ఇటీవల భారత్ పర్యటనలో బద్రాగ్ ఎయిర్ బేస్ వినియోగాన్ని ఆఫర్ చేశారు. మొదట భారత్ స్పందించకపోయినా, ఇప్పుడు నేరుగా బగ్రామ్‌లో సుఖోయ్‌లను దింపడం ఆ ప్రతిపాదనకు ప్రతిఫలంగా కనిపిస్తోంది. దీంతో పాకిస్తాన్ దక్షిణాన బలూచ్ గ్రూపులు, ఉత్తరంలో తెహ్రిక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్ దాడులు చేస్తున్న సమయంలో భారత్ బగ్రామ్‌లో ఎంటర్ కావడంతో పాకిస్తాన్ వెన్నులు వణుకు మొదలైంది. ఒకవైపు తూర్పున రాజస్తాన్ సరిహద్దు వద్ద భారత దళాలు సన్నద్ధమవుతుండగా, మరోవైపు పశ్చిమ దిశనుంచి కొత్త ముప్పు తలెత్తింది.
ముప్పేట సైనిక సన్నద్ధత..
ఇటీవలి భారత్ త్రిశక్తి విన్యాసాలకు అనుగుణంగా మూడు ప్రధాన నోటామ్స్ జారీ చేసింది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 10 వరకు సర్‌క్రీక్ నుంచి రాజస్తాన్ సరిహద్దు దాకా నిషేధిత గగన పరిధి ప్రకటించబడింది. అదే సమయంలో ఆగ్రా–మథుర ప్రాంతాల్లో, మరోదశలో బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోనూ యుద్ధ విన్యాసాలకు సూచనలు విడుదలయ్యాయి. దీనివల్ల పాక్, బంగ్లా రెండు వైపులా ఒత్తిడి నిలిచింది.
‘ఆపరేషన్ సిందూర్ 2.0’కు బాటలు
ఉగ్ర శిబిరాల కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భారత సైన్యం ఉడి, కిషన్‌గంగా, లీపా లోయల్లో బంకర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటన్నింటి సమన్వయంతో ‘‘ఆపరేషన్ సిందూర్ 2.0’’ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇప్పటికే ఎయిర్ డిఫెన్స్ రాడార్ వ్యవస్థ, కమ్యూనికేషన్ కంట్రోల్ నెట్‌వర్క్, మిసైల్ మెకానిజమ్ బలోపేతంపై దృష్టి సారించింది.
ఇప్పటివరకు భారత్‌కు ఉన్న ప్రధాన రక్షణ సమీకరణ తూర్పు, ఉత్తర ఫ్రంట్‌లలోనే కేంద్రీకృతమై ఉండేది. అయితే బగ్రామ్‌లో సైనిక ఉనికి నెలకొల్పడంతో పాకిస్తాన్‌పై ముప్పేటా దాడిచేసే వ్యూహం. బగ్రామ్‌లో భారత వైమానిక ఉనికి కేవలం సాంకేతిక కదలిక కాదు, అది దక్షిణాసియాలో కీలకం. తాలిబాన్‌తో భారత సత్సంబంధాల నేపథ్యంలో కొత్త సైనిక సమీకరణ మారబోతోంది.