Pakistan Vs India: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. ఆ దేశానికి తీవ్ర నష్టం మిలిగ్చింది. సైనికపరంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. చివరకు అణ్వాయుధాలు కూడా దెబ్బతిన్నాయి. అయినా పాకిస్తాన్ ఇటీవల కొన్ని కారణాల వల్ల సంతోషంగా కనిపిస్తుంది. అయితే ఆ ఆనందం క్షణికమైనదిగానే మిగిలిపోతోంది. దేశంలోని సైనిక స్థావరాలు, అణ్వాయుధ వ్యవస్థలపై దాడులు, బలూచిస్తాన్ తిరుగుబాటు, మిత్రదేశాల రాజకీయ ఆటలు దీనికి కారణమవుతున్నాయి.
Also Read: చంద్రబాబు ఉన్నతి వెనుక రాజశేఖర్ రెడ్డి.. నిజం ఎంత?
భద్రతా సంక్షోభం..
పాకిస్తాన్‌లోని 11 వైమానిక స్థావరాలు ఇటీవల జరిగిన దాడుల్లో ధ్వంసమయ్యాయి. అణ్వాయుధ వ్యవస్థలకు సంబంధించిన కీలక సౌకర్యాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ దాడులు దేశ భద్రతా వ్యవస్థలోని బలహీనతలను బహిర్గతం చేశాయి. ప్రస్తుతం ఈ స్థావరాలను పునరుద్ధరించే పనులు జరుగుతున్నప్పటికీ, ఈ ఘటనలు పాకిస్తాన్ సైనిక బలాన్ని ప్రశ్నార్థకం చేశాయి. ఈ నేపథ్యంలో దేశం సంతోషంగా ఉండటం విడ్డూరంగా కనిపిస్తుంది.
చైనా–భారత్ సంబంధాలతో ఆందోళన
పాకిస్తాన్‌కు చైనా ఎప్పటినుంచో మిత్రదేశంగా ఉంది. చైనా భారత్‌తో సరిహద్దు వివాదాలు, భూభాగ ఆక్రమణలు, రాజకీయ కవ్వింపులు పాకిస్తాన్‌కు సంతోషాన్ని ఇచ్చాయి. అయితే, ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఆగస్టు 31న భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా సందర్శన, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావడం పాకిస్తాన్‌లో ఆందోళనను రేకెత్తించింది. ఈ సమావేశం భారత్–చైనా వాణిజ్య, వ్యాపార సంబంధాలను బలోపేతం చేసే అవకాశం ఉంది. ఇది పాకిస్తాన్‌కు రాజకీయంగా, వ్యూహాత్మకంగా నష్టం కలిగించవచ్చు.
అమెరికాతో దోస్తీ..
పాకిస్తాన్ సైన్యాధికారి ఆసిఫ్ మునీర్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన సంగతి దేశంలో సంతోషాన్ని కలిగించింది. ట్రంప్ పాకిస్తాన్‌ను మిత్రదేశంగా ప్రకటించడం, బలూచిస్తాన్‌లోని అరుదైన ఖనిజాలను అమెరికాకు అప్పగించడం ద్వారా పాకిస్తాన్ రెండు లక్ష్యాలను సాధించాలని భావించింది. ఒకటి భారత్–అమెరికా సంబంధాలను దెబ్బతీయడం, రెండోది బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఎ) తిరుగుబాటును అణచివేయడం. ఇదే సమయంలో ట్రంప్ భారత్‌ఫై టారిఫ్‌లు విధించడం పాకిస్తాన్‌కు ఆనందం కలిగిస్తోంది. అయితే, బీఎల్‌ఎ జఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మూడోసారి దాడి చేసి పాకిస్తాన్‌కు హెచ్చరిక జారీ చేసింది. అమెరికా సహకారం ఉన్నప్పటికీ, బలూచిస్తాన్ సమస్య పరిష్కారం కావడం కష్టంగా కనిపిస్తోంది.
బలూచ్ సుదీర్ఘ పోరాటం..
బలూచిస్తాన్‌లోని తిరుగుబాటు పాకిస్తాన్‌కు దీర్ఘకాల సమస్యగా మారింది. బీఎల్‌ఎ దాడులు దేశంలో అస్థిరతను పెంచుతున్నాయి. అమెరికా సహాయంతో ఈ తిరుగుబాటును అణచివేయాలన్న పాకిస్తాన్ ఆలోచన ఫలించేలా కనిపించడం లేదు. జఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడులు ఈ సమస్య యొక్క తీవ్రతను సూచిస్తున్నాయి. ఇది పాకిస్తాన్ ఆర్థిక, రాజకీయ స్థిరత్వానికి పెను సవాలుగా నిలుస్తోంది.
పాకిస్తాన్ సంతోషానికి ప్రధాన కారణాలు చైనా–భారత్ వివాదాలు, అమెరికాతో సన్నిహిత సంబంధాలు అయినప్పటికీ, ఈ ఆనందం శాశ్వతంగా కనిపించడం లేదు. భారత్–చైనా సంబంధాలు మెరుగవుతుండటం, బలూచిస్తాన్‌లో తిరుగుబాటు, సైనిక స్థావరాలపై దాడులు పాకిస్తాన్‌ను ఆందోళనలోకి నెట్టాయి. ఈ పరిస్థితులు దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, భద్రతా సవాళ్లను మరింత స్పష్టం చేస్తున్నాయి.