
కరోనా వైరస్ నిరోధానికి ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లు అభివ్రుద్ధి చెందుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా ప్రయోగాలు చివరి దశకు వచ్చాయి. అయితే అదనంగా మరోసారి ఈ టీకాను పరీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కంపెనీ సీఈవో పాస్కల్ సోరియట్ తెలిపారు. టీకా తక్కువ డోసు తీసుకున్న వారిలో ఎక్కువ పనితీరు కనబర్చిందని అన్నారు. ఆ కోణంలోనే మరోసారి ప్రయోగాలు నిర్వహిస్తామన్నారు. మరోవైపు వ్యాక్సిన్ అనుమతి కోసం మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో జరిపిన ప్రయోగాల సమాచారం ఆధారంగా అమెరికా ఎఫ్ ఢీఏ అనుమతులిచ్చేందుకు సుముఖంగా లేదని తెలిపారు.