
బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాుటుకు సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు ఈనెల 16వ తేదీన ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు. బీహార్ 243 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎన్డీయే కూటమిలో బీజేపీ 125 స్థానాలను గెలుచుకుంది. నితీశ్ పార్టీ కేవలం 43 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం నితీశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆరోజు బీహార్ వాసులు ఎంతో పవిత్రంగా జరుపుకునే ’భయ్యూ దూజ్‘ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.