
దేశంలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,254 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 514 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 83,13,877 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,23,611 గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 76,56,478 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా 24 గంటల్లో 12,09,609 పరీక్షలు చేయగా మొత్తం ఇప్పటి వరకు 11,29, 98, 959 టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రీసెర్ఛ్(ఐసీఎంఆర్) తెలిపింది.