
తమిళనాడు కోసం జీవితాన్ని త్యాగం చేస్తానని, రాష్ట్ర ప్రజల కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా సంతోషపడతానని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. రాజకీయాల్లోకి రాబోతున్నానంటూ ప్రకటించిన అనంతరం తలైవా తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ ప్రవేశాన్ని కొందరు విమర్శిస్తూనే ఉన్నారని రజనీ ఈ సందర్భంగా తెలిపారు. వైద్యులు వద్దంటున్నా.. ప్రజలు, అభిమానుల కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.