
టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడైన దిగ్గజ బ్యాట్స్‌మన్ అని మాజీ సారథి సునీల్ గావస్కర్ ప్రశంసించాడు. అతడిలా మరెవరూ ఆడలేరని చెప్పాడు. బుధవారం జరిగిన మూడో వన్డేలో కోహ్లీ (63) పరుగులు చేసి హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ చేతికి చిక్కి ఔటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు వన్డే ఫార్మాట్లో అరుదైన ఘనత సాధించాడు. 251 మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని అందుకొని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.