
పాకిస్తాన్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ క్రికెట్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. 2009లో పాకిస్తాన్ జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన మహ్మద్ అమీర్ పిన్న వయసులోనే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మహమ్మద్ అమీర్ 30 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20 మ్యాచ్‌లలో పాకిస్తాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 119 వికెట్లు, వన్డేల్లో 81, టీ20ల్లో 59 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనకు పాకిస్తాన్ జట్టులో అమీర్‌కు చోటు దక్కలేదు. దీంతో ప్రపంచ క్రికెట్‌కు మహమ్మద్ అమీర్ వీడ్కోలు పలికాడు. అతి తక్కువ వయసులోనే రిటైర్మైంట్ ప్రకటించడం పాకిస్తాన్ క్రికెట్‌లో వివాదాస్పదమైంది.