Modi And Jinping And Putin Meeting: ఏనుగు తన నెత్తిమీద తనే మన్ను పోసుకుంటుంది. అది దాని స్వయంకృతాపరాధం. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అలానే వ్యవహరిస్తున్నాడు. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉంటూ.. తన సార్వభౌమాధికారాన్ని పెంపొందించుకోవాల్సిన తరుణంలో.. అడ్డగోలు విధానాలకు పాల్పడుతూ విమర్శలకు కారణమవుతున్నాడు. తనకు గిట్టని దేశాలపై సుంకాల విధిస్తూ టెంపరితనాన్ని ప్రదర్శిస్తున్నాడు. ట్రంప్ తీసుకుంటున్న పనికిమాలిన నిర్ణయాల వల్ల అమెరికా అంతకంతకు అనుభవిస్తోంది. ఒకప్పుడు అమెరికా ప్రపంచ దేశాల మీద సుంకాలు విధిస్తే భయపడిపోయేవి. ఇప్పుడు భయపడే రోజులు కావు కాబట్టి.. పైగా అమెరికాకు ఎదురు తిరిగే రోజులు కాబట్టి.. అగ్ర రాజ్యానికి మూడినట్టేనని విశ్లేషకులు అంటున్నారు..
Also Read: ప్రపంచ జనాభాలో 11 శాతం మంది ఒకే సన్నని పట్టీపై జీవిస్తున్నారని మీకు తెలుసా?
ఐక్యతా రాగం
ట్రంప్ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో చైనా, అమెరికా, రష్యా ఐక్యతా రాగాన్ని ఆలపిస్తున్నాయి. ఈ మూడు దేశాలను ఏకం చేసే బాధ్యతను డ్రాగన్ ప్రెసిడెంట్ భుజాలకు ఎత్తుకున్నారు.. త్వరలోనే జరిగే షాంగై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో భారత్, రష్యా దేశాల అధిపతులు పాల్గొంటున్నారు.. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని తియాంజిన్ నగరంలో ఈ సమ్మిట్ నిర్వహిస్తారు.. కేవలం రష్యా, భారతదేశాన్ని మాత్రమే కాకుండా మధ్య ఆసియా, దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా, మధ్య ప్రాచ్యం దేశాలకు చెందిన నాయకులను కూడా ఈ సమ్మిట్ కు ఆహ్వానించారు. ఏడు సంవత్సరాల క్రితం చైనాలో మోడీ పర్యటించారు. ఆ తర్వాత చైనాలో మోడీ అడుగు పెట్టడం ఇదే తొలిసారి. గల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణల తర్వాత తొలిసారిగా చైనాలో మోడీ అడుగు పెడుతున్నారు.. ఇక 2024లో రష్యాలో బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. నాడు చైనా అధ్యక్షుడు, నరేంద్ర మోడీ ఒకే వేదికను పంచుకున్నారు. ఆ తర్వాత వారిద్దరు పరస్పరం మీట్ అవడం ఇదే తొలిసారి.
గడచిన జనవరి నుంచి..
గడిచిన జనవరి నుంచి అమెరికా భారత్, చైనా, రష్యా మీద రకరకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చింది. అవన్నీ పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు. దీంతో అమెరికా అహం దెబ్బతిన్నది. అందువల్లే సుంకాలు విధిస్తున్నది. అయితే శ్వేత దేశ ఆధిపత్యానికి గండి కొట్టడానికి డ్రాగన్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందువల్లే ఈ సమ్మిట్ ద్వారా గట్టి పాఠాన్ని అమెరికాకు చెప్పాలని చైనా భావిస్తున్నది. అమెరికా కు బుద్ధి చెప్పడం డ్రాగన్ వల్ల కాదు కాబట్టి రష్యా, భారత సహాయం తీసుకుంది. అప్పట్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా శ్వేత దేశ అధిపతి కంగారు పడ్డారు. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఆగలేదు. ఇప్పుడు షాంగై సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో.. ట్రంప్ ఎలా వ్యవహరిస్తారనేది చూడాల్సి ఉంది. మరోవైపు గ్లోబల్ మీడియా కూడా ఈ సమ్మిట్ ను ఆసక్తిగా గమనిస్తోంది..
దానిపై భారత్ కీలక ప్రకటన
ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరుపుతున్న ఉగ్రవాదాన్ని ఖండిస్తూ భారత్ ఈ వేదిక మీద బలమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు భారత్ స్వేచ్ఛగా ప్రకటన చేసేందుకు చైనా అవకాశం కల్పించిందని గ్లోబల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే భారత విదేశాంగ శాఖ నుంచి తన్మయ లాల్, విక్రమ్ మిశ్రీ, రామదీర్ జైస్వాల్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై జరిపే పోరులో తమ దేశం ఏ మాత్రం వెనకడుగు వేయదని.. ఎలాంటి వేదికైనా సరే వ్యతిరేక ప్రకటన చేస్తుందని స్పష్టం చేశారు.