
కరోనా వైరస్ మహాత్మగాంధీ మునిమనువడు సతీష్ ధుపేలియాను బలి తీసుకుంది. న్యూమోనియా కారణంగా నెలరోజుల కిందట ఆసుపత్రిలో చేరిన ఆయన ఆదివారం మరణించినట్లు ఆయన సోదరి ఉమా ధుపెలియా-మెస్త్రీ తెలిపారు. ‘నా సోదరుడు సతీష్ ధుపేలియా న్యూమోనియాతో బాధపడ్డాడు. అసుప్రతిలో చేరగానే అతనికి కోవిడ్ సోకింది. ఆదివారం సాయంత్రం తనకు గుండెపోటు రావడంతో మృతి చెందాడు’అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా వీరి ధక్షిణాప్రికాలోని జోహెన్నెస బర్గ్ లో ఉంటున్నారు. సతీశ్ వీడియోగ్రాఫర్ గా, ఫొటోగ్రాఫర్ గా పనిచేసేవాడు. డర్బన్ సమీపంలోని ఫీనిక్స్ సెటిల్మెంట్ వద్ద గాంధీ ప్రారంభించిన పనులను కొనసాగించేందుకు చురుగ్గా పనిచేస్తున్నాడు.