
దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 44,059 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 511మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91,39,866గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,37,738 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,43,486 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 85,62,642 గా ఉంది. గత పది రోజులుగా కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. శీతాకాలం కావడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయని వైద్యలు తెలుపుతున్నారు.