https://oktelugu.com/

Lions Are Sold: అక్కడ సింహాలు అమ్మబడును.. ధర గేదె కన్నా తక్కువ!!

Lions Are Sold: సింహం.. అడవికి రాజు.. సాధారణంగా ఇవి అడవుల్లో లేదా జూపార్కుల్లో కనిపిస్తాయి. కొన్ని దేశాల్లో సంపన్నులైన జంతు ప్రేమికులు ఇళ్లలో కూడా పెంచుకుంటారు. అత్యంత క్రూరమైన జంతువు అయిన సింహాలను పోషించలేక ఓ దేశం ఇప్పుడు వాటిని అమ్మకానికి పెట్టింది. ధర కూడా గేదె ధర కన్నా తక్కువగా ఉండడం విశేషం.. నిత్యం ఏదో ఒక సమస్య, ఏడాదికో సంక్షోభంలో కూరుకుపోయే మన దాయాది దేశం పాకిస్తాన్‌. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఆర్థిక […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 30, 2022 3:27 pm
    Follow us on

    Lions Are Sold: సింహం.. అడవికి రాజు.. సాధారణంగా ఇవి అడవుల్లో లేదా జూపార్కుల్లో కనిపిస్తాయి. కొన్ని దేశాల్లో సంపన్నులైన జంతు ప్రేమికులు ఇళ్లలో కూడా పెంచుకుంటారు. అత్యంత క్రూరమైన జంతువు అయిన సింహాలను పోషించలేక ఓ దేశం ఇప్పుడు వాటిని అమ్మకానికి పెట్టింది. ధర కూడా గేదె ధర కన్నా తక్కువగా ఉండడం విశేషం..

    Lions

    నిత్యం ఏదో ఒక సమస్య, ఏడాదికో సంక్షోభంలో కూరుకుపోయే మన దాయాది దేశం పాకిస్తాన్‌. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. దానిని ఎదుర్కొనేందుకే శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇటీవల రాజకీయ సంక్షోభం ముగిసింది. ఇప్పుడు కరోనా అనంతరం అక్కడ పరిస్థితిలు దయనీయంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్కడ జూల నిర్వహణ కూడా పాకిస్తాన్‌ ప్రభుత్వానికి భారంగా మారింది. ఈ నేపథ్యంలో తమ జూలలోని సింహాలను విక్రయిస్తామంటూ అక్కడి జూ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

    జంతువుల ఆలనా పాలనా చూడలేక..

    తీవ్ర ఆర్థిక సంక్షోభంతొ కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌ ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజల సమస్యలు తీర్చడం, వారికి సేవలు అందించడమే గగనంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో జూలో ఉన్న జంతువుల ఆలనా పాలనా చూసేందుకు కూడా డబ్బులులేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో పాక్‌ ప్రభుత్వం సింహాలను విక్రయించాలని నిర్ణయించినట్లు ఆ దేశ మీడియా సంస్థలు పలు కథనాల్లో తెలిపాయి. అది కూడా ఓ గేదెను కొనుగోలు చేసే ధర కన్నా తక్కువ ధరలో అంటూ పేర్కొన్నాయి.

    ఆఫ్రికన్‌ సింహాలు..

    పాకిస్తాన్‌లోని లాహోర్‌ సఫారీ జూలో అఫ్రికన్‌ సింహాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు ధర పాకిస్తాన్‌ కరెన్సీ ప్రకారం ఒక సింహాన్ని రూ.1,50,000 కంటే తక్కువకే అమ్ముతామని జూ అధికారులు తెలిపారు. ఈమేరకు అక్కడి మీడియా సంస్థ సామా టీవీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కాగా, పాకిస్తాన్ లో ఒక గేదె ధర ఆన్ లైన్‌ మార్కెట్‌లో రూ.1,50,000 నుంచి రూ.3,50,000 పలుకుతోంది.

    12 సింహాల విక్రయం..

    లాహోర్‌ సఫారీ జూలోని 12 సింహాలను విక్రయించనున్నట్లు జూ యాజమాన్యం ప్రకటించింది. ఆగస్టు తొలివారంలో విక్రయానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. కేవలం జింహాల పోషణ ఖర్చు భారీగా ఉండడం, ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో వాటిని పోషించడం భారంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి 12 సింహాలను విక్రయిస్తామని తెలిపింది. ప్రైవేటు వ్యక్తులు, వన్యప్రాణుల సంరక్షణపై ఆసక్తి ఉన్నవారు కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. అయితే ఈ జూ యాజమాన్యం సింహాలను విక్రయించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా 14 సింహాలను విక్రయించినట్లు సమాచారం.

    Tags