
కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు రూ.6వేలు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్రం ఏడో విడత నగదును పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా రూ. 2వేల నగదును నేటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేయనుంది. తమకు నగదు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి పీఎం కిసాన్ సమ్మాన్ యోజన అధికార వెబ్ సైట్ లో చూసుకోవాలని సంబంధిత అధికారులు రైతులకు సూచిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు ఆరు విడతలుగా రైతులకు సంవత్సరానికి రూ.6వేల చొప్పున నగదును పంపిణీ చేసింది. తాజాగా ఏడోవిడతకు సంబంధించిన నగదును పంపిణీ చేస్తున్నారు. కాగా కొందరి అకౌంట్లలోకి ఇప్పటికీ నగదు చేయడం లేదు.