
భారతదేశ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వంతో పరిశ్రమ వర్గాలు కలసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ వార్షిక సదస్సులో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. “కొవిడ్ -19 వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితుల నుంచి బయటపడి దేశ ఆర్ధిక వ్యవస్థ లక్ష్యాలను సాధించడానికి ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ తన వంతు సహకారాన్ని అందించిందని అన్నారు. దీనితో 2025 నాటికి అయిదు ట్రిలియన్ అమెరికా డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ధి సాధించడానికి అవసరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు.