
ఏలూరు తరహా ఘటనలు పునరావృతం కాకూడదు సీఎం జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఏలూరు ఘటనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు కలెక్టరేట్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, డీఎంహెచ్‌వో డాక్టర్ సునంద, డీసీహెచ్‌మో డాక్టర్ ఏవీఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.