
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పెడుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 478 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో రాష్ట్రంలో 8,76,814కు కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,067 మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 4,420 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి 8,65,327 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా విశాఖలో ఇద్దరు, కడపలో ఒకరు కరోనాతో మృతి చెందారు.