భారతదేశం కోవిడ్ రహిత దేశంగా మారబోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం కోవీషీల్డ్, కోవాగ్జిన్, వ్యాక్సిన్లకు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మాట్లాడారు. కరోనా కోరల్లో చిక్కకున్న భారత్ ను దేశీయ శాస్ర్తవేత్తలు ఎంతో శ్రమించి వ్యాక్సిన్లు తయారు చేశారన్నారు. ఈ సందర్భంగా వారికి, భారతీయులందరికీ అభినందనలు అని చెప్పారు. అత్యవసర వినియోగానికి దేశీయ వ్యాక్సిన్లు సిద్ధమవడం గర్వకారణమన్నారు. దీనిని భట్టి భారత్ ఏ స్థాయిలో నైపుణ్య విలువలు కలిగి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కరోనా సమయంలో వైద్యులు, పారిశుధ్య కార్మికులు, ఇతర కరోనా వారియర్స్ దేశ ప్రజలను వైరస్ నుంచి కాపాడారన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: India to be a kovid free country narendra modi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com