RK Kotha Paluku: మామూలుగానే రాధాకృష్ణ ఒక టెంపో లో ఉంటాడు. కొత్త పలుకులు అయితే తన అగ్రెసివ్నెస్ మొత్తాన్ని ప్రదర్శిస్తుంటాడు. అవకాశాలు లేని చోటనే జగన్మోహన్ రెడ్డిని అమాంతం విమర్శించే రాధాకృష్ణ.. అవకాశం దొరికితే ఎందుకు ఊరుకుంటాడు. పైగా ఇప్పుడు జగన్ కల్తీ మద్యం మద్యం, మద్యం కుంభకోణం, గూగుల్ డేటా సెంటర్ పై వ్యతిరేక ప్రచారం వంటి వాటిల్లో పీకల లోతు మునిగిపోయాడు. పైగా చంద్రబాబు ఒత్తిడికి జగన్ సొంత మీడియా తీవ్ర ఉక్కపోతను ఎదుర్కొంటోంది. 2014 -2019 కంటే ఎక్కువగా ఒత్తుతున్నాడు. పైగా కేంద్రంలో చంద్రబాబుకు మోడీ సపోర్ట్ దండిగా ఉంది. ఇన్ని పరిణామాలు అనుకూలంగా ఉన్న తర్వాత రాధాకృష్ణ ఎందుకు ఆగుతాడు.. దూసుకుపోయాడు.. తన ఆంధ్రజ్యోతిలో ఆదివారం కొత్త పలుకు వ్యాసంలో జగన్మోహన్ రెడ్డిని చెడుగుడు ఆడుకున్నాడు.
గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు శ్రీకారం చుట్టిన నాటి నుంచి జగన్ మీడియా వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని.. ప్రజలు ఇబ్బంది పడతారని.. విశాఖపట్నం సర్వనాశనం అవుతుందని తన సొంత మీడియాలో ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేయిస్తోంది వైసిపి. దీనికి కొంతమంది మేధావులు కూడా వంత పాడుతున్నారు. ఇదే విషయాన్ని రాధాకృష్ణ ప్రముఖంగా ప్రస్తావించారు. ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా కూడా మారీచుల వారసులంటూ చాలా బరువైన పదాన్ని వాడారు రాధాకృష్ణ. అంతేకాదు తనపై దేశద్రోహం కేసులు పెట్టారని, తన ఏబీఎన్ ఛానల్ ప్రసారాలను అడ్డుకున్నారని.. టీవీ5ని ఇబ్బంది పెట్టారని రాధాకృష్ణ తన కొత్త పలుకు వ్యాసంలో ఏ కరువు పెట్టాడు.
ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం పై ఆగ్రహంతో ఉన్న రాధాకృష్ణ ఈ వ్యాసం ద్వారా ఒక్కసారిగా మారిపోయాడు. క్రితం వ్యాసంలో కూడా చంద్రబాబుకు అనుకూలంగా రాసిన రాధాకృష్ణ.. ప్రభుత్వంలో కొంతమంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొంతమంది ఎమ్మెల్యేలపై తన సొంత మీడియాలో వ్యతిరేక కథనాలను కూడా రాధాకృష్ణ రాశాడు. చంద్రబాబు తీసుకొచ్చిన పేదరిక నిర్మూలన పథకాన్ని కూడా రాధాకృష్ణ ఆక్షేపించాడు. అంతకుముందు కొన్ని వారాలపాటు చంద్రబాబు ప్రభుత్వంలో తప్పులను ఎండగట్టాడు. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను కూడా తూర్పారబడ్డాడు. కానీ ఆకస్మాత్తుగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు తర్వాత రాధాకృష్ణ లో మార్పు వచ్చింది. చంద్రబాబులో పనితనం అతడికి కనిపిస్తోంది. ఇన్ని రోజులు రాధాకృష్ణకు ఏమైంది అంటారు,,? అకస్మాత్తుగా ఇంత మార్పు ఎలా సాధ్యమైంది అంటారు?
రాధాకృష్ణ రాసినా, రాయకపోయినా గూగుల్ డేటా సెంటర్ అనేది ఏపీలో బిగ్ చేంజర్. అది ఎకనామికల్ గా కూడా చాలా ప్రభావాన్ని చూపించనుంది. ప్రధానమంత్రి అన్నట్టు విశాఖపట్నం త్వరలోనే ఏఐ క్యాపిటల్గా మారబోతోంది. కర్ణాటక రాష్ట్రం ఇప్పటికే ఏడుపులు మొదలుపెట్టింది. అంటే దీనిని బట్టి చంద్రబాబు, లోకేష్ ఎలా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. ఇదంతా తెలిసింది కాబట్టే రాధాకృష్ణ మారిపోయారు. చంద్రబాబుకు జై కొట్టారు.