Homeజాతీయం - అంతర్జాతీయంIndia China Relations: అట్లుంటదీ మోడీతోని..

India China Relations: అట్లుంటదీ మోడీతోని..

India China Relations: కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదా.. సేమ్ అలాంటిదే.. కుక్క లాంటి ట్రంప్ కు చెప్పు (చైనా) దెబ్బ అయితే కరెక్ట్ అని గ్రహించిన ప్రధాని మోడీ గట్టి షాక్ ఇచ్చాడు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న నానుడిని నిజం చేస్తూ చైనాను చేరదీసి అగ్రరాజ్యం అమెరికాకు గట్టి షాక్ ఇచ్చాడు. ట్రంప్ భారత్ ను తొక్కేదామనుకుంటే చైనాతో కలిసి ఇండియానే అమెరికాకు షాకిచ్చింది. మోడీ దెబ్బకు ఇప్పుడు అమెరికా అంతా కుయ్యో మొర్రో అన్నట్టుగా తయారవుతోంది.

Also Read: తెలంగాణ పోలీస్ శాఖలోకి ప్రైవేట్ వ్యక్తి.. బదిలీలు, పదోన్నతులు, సెటిల్మెంట్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ విధించిన వాణిజ్య సుంకాలపై భారత్ ఘాటుగా స్పందించింది. చైనాపై శిక్షాత్మక చర్యలు తీసుకోకుండా ఇండియాపై 50 శాతం వరకు టారిఫ్‌లు విధించడం ట్రంప్ తీసుకున్న తప్పుడు నిర్ణయమని సొంత అమెరికా దేశం నుంచే ఆరోపణలు వస్తున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

లఢక్ సరిహద్దు ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు పూర్తిగా గందరగోళానికి గురయ్యాయి. చైనా యాప్‌లపై నిషేధం, పాక్‌కు మద్దతుగా చైనా వ్యవహరించడం.. ఈ రెండు అంశాలు రెండు దేశాల మధ్య గోడలు కట్టాయి. కానీ, తాజాగా భారత్ కొత్త వ్యూహం అనుసరించి చైనాతో మళ్లీ వాణిజ్య బంధాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తోంది.

ఈ క్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ భారత పర్యటనకు రావడం చారిత్రాత్మకమైంది. ఎరువులు, రేర్ మినరల్స్‌, యంత్ర పరికరాల సరఫరాపై చైనా అంగీకరించడంతో భారత్‌కి ఊరట లభించింది. మరోవైపు పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ అమెరికా వెళ్లి ట్రంప్‌ మద్దతు కోరడం, దానికి ప్రతిఫలంగా ఇండియాపై టారిఫ్‌లు విధించడం న్యూ ఢిల్లీని ఆగ్రహానికి గురి చేసింది. దాంతో భారత్‌ చైనాతో మైత్రిని కొత్త పుంతలు తొక్కించాలనే నిర్ణయం తీసుకుంది.

ఈ పరిణామాల మధ్య మోడీ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. “చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీని కలిసినందుకు ఆనందంగా ఉంది. గతేడాది కజాన్‌లో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో నా భేటీ తర్వాత భారత్-చైనా సంబంధాలు పరస్పర గౌరవం, సున్నితత్వం ఆధారంగా స్థిరంగా ముందుకు సాగుతున్నాయి. టియాంజిన్‌లో జరగబోయే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా మా తదుపరి సమావేశాన్ని ఎదురుచూస్తున్నాను. భారత్-చైనా మధ్య స్థిరమైన, నిర్మాణాత్మక సంబంధాలు ప్రాంతీయంగా మాత్రమే కాకుండా, ప్రపంచ శాంతి-సంపదలకు కూడా దోహదం చేస్తాయి” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలతో పాటు చైనాతో బంధం పునరుద్ధరణ.. అమెరికాకు, ముఖ్యంగా ట్రంప్‌కు, భారత్ ఇచ్చిన గట్టి సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. SCO సదస్సులో మోడీ-షీ భేటీ మరింత కీలకం కానుంది.

మొత్తంగా చెప్పాలంటే, అమెరికా విధించిన ఆర్థిక ఒత్తిడికి ప్రతిస్పందనగా, మోడీ చైనాతో కొత్త వ్యూహాత్మక మైత్రిని బలోపేతం చేసి ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చినట్టే కనిపిస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version