
రైతుల ఆందోళనలపై బీజేపీ గురుదాస్‌పూర్ లోక్‌సభ ఎంపీ, సినీ నటుడు సన్నీడియోల్ స్పందించారు. తాను ఇటు పార్టీవైపు, అటు రైతుల వైపు కూడా ఉంటానని చెప్పారు. రైతుల స్థితి మెరుగుపడాలని కేంద్రం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘ఇది రైతులు, ప్రభుత్వానికి చెందిన అంశం. చర్చల తర్వాత ఒక పరిష్కారానికి వస్తారు. వారి మధ్యకు ఎవరూ రావద్దని యావత్ ప్రపంచాన్ని కోరుకుంటున్నాను. దీని నుంచి చాలా మంది లబ్ధి పొందేందుకు, సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం నాకు తెలుసు. వారి ఆలోచన రైతుల గురించి కాదు. అందిరకీ సొంత ఎజెండాలు ఉన్నాయి’ అని సన్నీడియోల్ అన్నారు.