వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేస్తా..రిటైర్మెంట్ అని చెప్పలేదు: నితీశ్

బీహార్ లో ఇటీవల జరగిన ఎన్నికల ప్రచారంలో నితీశ్ కుమార్ ఈ ఎన్నికల తరువాత రిటైర్మెంటూ అని ప్రకటించాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నితీశ్ పాట్నాలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నిక తనకు చివరిది కాదని, వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని చెప్పారు. ‘ప్రతీ ఎన్నికల చివరి ర్యాలీలో నేను ‘ముగింపు బాగుంటే, అంతా బాగుంటుంది‘ అనే మాటతో ముగిస్తాను. దీనిని మీడియా సరిగా అర్థం చేసుకోలేదన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా..? అన్న […]

Written By: Suresh, Updated On : November 13, 2020 1:09 pm
Follow us on

బీహార్ లో ఇటీవల జరగిన ఎన్నికల ప్రచారంలో నితీశ్ కుమార్ ఈ ఎన్నికల తరువాత రిటైర్మెంటూ అని ప్రకటించాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నితీశ్ పాట్నాలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నిక తనకు చివరిది కాదని, వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని చెప్పారు. ‘ప్రతీ ఎన్నికల చివరి ర్యాలీలో నేను ‘ముగింపు బాగుంటే, అంతా బాగుంటుంది‘ అనే మాటతో ముగిస్తాను. దీనిని మీడియా సరిగా అర్థం చేసుకోలేదన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా..? అన్న ప్రశ్నకు ప్రస్తుతం గవర్నర్ కు రాజీనామా లేఖను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆ తరువాత ఎన్డీయే నేతలే తనను ఎన్నుకోవాలని తెలిపారు. కాగా  బీహార్ 243 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎన్డీయే కూటమిలో బీజేపీ 125 స్థానాలను గెలుచుకుంది. నితీశ్ పార్టీ కేవలం 43 స్థానాలను మాత్రమే దక్కించుకుంది.