భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌కు గుండెపోటు వచ్చింది.దీంతో ఆయనను ఢిల్లీ అసుపత్రిలో చేర్పించారు. అంతకుముందు ఆయనకు డయాబెటిస్ సంబంధ ఆరోగ్య సమస్యలున్నాయి. ప్రస్తుతం ఆయనకు యాంజియోప్లాస్టి చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది. 1983లో భారతదేశానికి మొదటి ప్రపంచ కప్ తెచ్చిన పేరు కపిల్‌కు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ గురించి ఆయన ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నాడు. కపిల్‌దేవ్‌కు గుండెపోటు వార్త సోషల్ మీడియాలో రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.