H-1B Visa New Rules: ట్రంప్ ఏ ముహూర్తానయితే హెచ్ వన్ బి వీసా కు లక్ష డాలర్లు ఫీజు వసూలు చేస్తున్నట్టు ప్రకటించాడో.. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కుదేలు అయిపోయింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఐటీ కంపెనీలు తల పట్టుకున్నాయి. ఇక ఫార్మా కంపెనీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ వల్ల ఎఫెక్ట్ కానీ రంగమంటూ లేదు. ఇంత జరుగుతున్నప్పటికీ ట్రంప్ జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాడు. తన నిర్ణయం పట్ల పూర్తి స్పష్టతతో ఉన్నట్టు చెబుతున్నాడు. సరే ఇవి ఎంతవరకు దారి తీస్తాయి.. ఎక్కడ దాకా వెళ్తాయి అనే విషయాలను పక్కన పెడితే.. ట్రంప్ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాని మాత్రం షేక్ చేస్తోంది.
ట్రంప్ మీద సోషల్ మీడియాలో కొన్ని కోట్ల కొలది వీడియోలు.. మీమ్స్ ఉంటాయి. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ట్రంప్ చిత్రచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటాడు. అవి కూడా రాత్రికి రాత్రే అమలు జరిగిపోవాలని అనుకుంటాడు. అందువల్లే ఇలాంటి పరిస్థితి. రాంపు రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత తన దేశంలో ఉంటున్న చాలామందిని బయటకి పంపించాడు. ప్రపంచ దేశాల మీద టారిఫ్ లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఇవి మర్చిపోకముందే ఇప్పుడు ఏకంగా హెచ్ వన్ బి వీసా మీద లక్ష డాలర్ల ఫీజు వసూలు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీనివల్ల అమెరికాను గొప్పగా చేయాలని.. అమెరికాను ఉన్నతంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నట్టు ట్రంప్ చెబుతున్నాడు. ఇది వాస్తవంలో కార్యరూపం దాల్చు తుందా? లేదా అనే విషయాల పక్కన పెడితే.. ట్రంప్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.
ట్రంప్ తీసుకొన్న నిర్ణయం పట్ల చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. కొంతమంది మాత్రం స్వాగతిస్తున్నారు. ఇప్పటికైనా అమెరికాలో హెచ్ వన్ బి వీసా కింద ఉంటున్న భారతీయులు మొత్తం స్వదేశానికి రావాలని.. మాతృ దేశ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు. అంతేకాదు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వెనక మోడీ ఉన్నాడని.. మోడీ వల్ల ఇదంతా జరుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు కూడా స్పందిస్తున్నారు. ఒకవేళ మోడీ చెప్పినట్టు ట్రంప్ ఆ నిర్ణయం తీసుకుంటే.. అమెరికా నుంచి వెనక్కి వచ్చే వారికి ఎక్కడ ఉద్యోగాలు కల్పిస్తారు.. గుజరాత్ లోని దూలేరా స్మార్ట్ సిటీ లోనా, వాదనగర్ లోనా అని ప్రశ్నిస్తున్నారు.
First batch of NRI Bhakts ready to come back to India after getting kicked out due to H-1B Visa mess
Where should Modi Ji send them? Dholera Smart City or Vadnagar? pic.twitter.com/MfnaOikIjW
— Ankit Mayank (@mr_mayank) September 20, 2025