
ప్రముఖ బెంగాలీ నటుడు మను ముఖర్జీ ఆదివారంనాడు గుండెపోటుతో కన్నుమూసినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ముఖర్జీ వయస్సు 90 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ముఖర్జీ తన సినీ కెరీర్‌ను మృణాల్ సేన్ తీసిన ‘నీల్ ఆకాషెర్ నీచే’ (నీలాకాశం కింద- 1958)) చిత్రంతో ప్రారంభించారు. సత్యజిత్ రే తీసిన ‘జాయ్ బాబా ఫెలూనాథ్’, ‘గనశత్రు’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. బాలల ఫాంటసీ చిత్రం ‘పాతాళ్‌ఘర్’లోనూ ఆయన నటనా సామర్థ్యం ప్రశంసలు అందుకుంది.