
మొదటి దశలో 51 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గురువారం వర్చువల్ వేదికగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌కు అన్ని సదుపాయాలు కల్పించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రాధాన్యతను అనుసరించి వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 74 లక్షల డోసులకు మించి నిల్వ సామర్థ్యానికి అన్ని ఏర్పాట్లు చేశామని, వారాంతంలో ఈ సామర్థ్యాన్ని 1.15 కోట్ల మోతాదుకు పెంచుతామని అన్నారు.