
పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో గుజరాత్‌లా మారనివ్వబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బుధవారం నిర్వహించిన బంగ్లా సంగీత్ మేళాకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ మట్టిని తాము గౌరవించుకుంటామని రక్షించుకుంటామని శపథం చేశారు. బెంగాల్‌ను ఎవరూ ముక్కలు చేయలేరని మమతా అన్నారు. ”ఇది మా మట్టి. మా అస్తిత్వానికి ఇది ప్రతీక. దీనిని మేము ఎంతగానో గౌరవించుకుంటాం. అలాగే కాపాడుకుంటాం కూడా. బెంగాల్‌ను ఎవరూ ముక్కలు చేయలేరు. కానీ కొందరు అలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారి ఆటలు ఇక్కడ చెల్లవు. అన్నారు.