
రాష్ట్రవ్యాప్తంగా వివిధ మొబైల్ టవర్లకు విద్యుత్ సరఫరాను రైతులు అడ్డుకుంటున్నారన్న వార్తల నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమీరందర్ సింగ్ స్పందించారు. అలాంటి చర్యలతో ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని ఆందోళనలో పాల్గొంటున్న రైతులకు ఒక అధికార ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. గత కొద్ది నెలలుగా రైతులు తమ ఆందోళనల్లో ఎలాంటి సంయమనం పాటిస్తూ వచ్చారో అదే సంయమనం కొనసాగించాలని కోరారు.