
నటుడు సోహెల్ క్రేజ్ బిగ్ బాస్ షోలో పాల్గొన్న తరువాత పదిరెట్లు పెరిగింది. ఆయన సినిమాలు, సీరియల్స్ చేసినా రాని గుర్తింపు బిగ్ బాస్ ద్వారా సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ కి వెళ్లిన సోహెల్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఆయన గ్లామర్ కి ముఖ్యంగా అమ్మాయిలు పడిపోయారని అనిపిస్తుంది. దీనికి తాజా సంఘటనే నిదర్శనం అని చెప్పవచ్చు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోహెల్ లైవ్ లో తన అభిమానులతో మాట్లాడారు. కాగా ఓ లేడీ కాలర్ సోహెల్ నువ్వంటే ఇష్టం అంటూ షాక్ ఇచ్చింది.
లైవ్ లో సోహెల్ కి లవ్ ప్రపోజల్ పెట్టారు సదరు లేడి. అలాగే నువ్వు ఏడిస్తే నేను చూడలేకపోతున్నాను… నువ్వు ఏడవకు అని చెప్పి తనపైన ఉన్న అపరిమితమైన ప్రేమను చాటుకుంది. టెన్షన్ పడకుండా నీ ఫ్రెండ్ లా నాతో మాట్లాడు అన్న సోహెల్, ఆమెతో ఆప్యాయంగా మాట్లాడాడు. ఆమె సోహెల్ కి ఐ లవ్ యూ చెప్పగా… ఆయన తిరిగి ఐ లవ్ యూ చెప్పడం విశేషంగా మారింది.
ఇక సోహెల్ హీరోగా కొత్త చిత్ర ప్రకటన జరిగింది. శ్రీనివాస్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత అప్పిరెడ్డి నిర్మిస్తున్నారు. అలాగే కొందరు దర్శక నిర్మాతలు సోహెల్ తో మూవీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట. బిగ్ బాస్ వేదిక సాక్షిగా చిరంజీవి సోహెల్ మూవీలో క్యామియో రోల్ చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 4 లో టాప్ 3 స్థానాన్ని దక్కించుకున్న సోహెల్, నాగార్జున ఆఫర్ చేసిన రూ. 25 లక్షలు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.