
గడిచిన 24 గంటల్లో దేశంలో 86,821 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 63,12,585 కు చేరింది. నిన్న ఒక్కరోజు 1181 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 98,678కి చేరింది. ఇందులో 9,40,705 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 52,73,201 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా పాజిటివ్ కేసులు 15.11 శాతం ఉండగా రికవరీ రేటు 83.33 శాతం ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉండగా 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,23,052 కరోనా పరీక్షలు నిర్వహించామని ఐసీఎమ్మార్ తెలిపింది.
Also Read: తెలంగాణలో కొత్తగా 2,214 కరోనా కేసులు..