
కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలేకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా టెస్ట్ చేయించుకోవడంత పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఆయన ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం రామ్‌దాస్ ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఇదివరకే కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో రామ్‌దాస్‌ను కలిసిన వారు ఆందోళనలో ఉన్నారు.