
బ్రిటన్ లో కనుగొన్న కొత్త వైరస్ తో భారత్లో ఆందోళన మొదలైంది. యూకే నుంచి వచ్చిన వారు తెలపాలని, వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ నేపథ్యంలో కేరళకు చెందిన కొందరు పరీక్షలు చేయించుకోగా తాజాగా 8 మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె.కె. శైలజ తెలిపారు. అయితే వీరికి ఏ రకమైన కరోనా సోకింది అనేది తేల్చడానికి శాంపిల్స్ ను పూణె ల్యాబ్ కు పంపించారు. కాగా ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చే విమాన సర్వీసులను భారత్ రద్దు చేసింది. అయితే ఇప్పటికే వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ తేలడంతో ఆందోళన మొదలైంది.