Home2020 రౌండ్ అప్గూగుల్ ‌లో అత్యధికంగా వెతికింది వీరినే !

గూగుల్ ‌లో అత్యధికంగా వెతికింది వీరినే !

Most searched Personalities
2020 సంవత్సరం ప్రత్యేకంగా కరోనా వైరస్ నామ సంవత్సరంగా చరిత్రలో నిలిచిపోతుంది. కరోనా మన జీవితాలను శాశ్వతంగా మార్చింది. ఈ కరోనా మహమ్మారితో పాటు అనేక ఇతర ప్రపంచ మరియు జాతీయ సంఘటనలు కూడా ఈ సంవత్సరంలో చాలా జరిగాయి, వాటి ద్వారా చాలా మంది ప్రముఖులు మరియు వ్యక్తులు వెలుగులోకి వచ్చారు. అయితే ఈ సంవత్సరం మరి కొద్దీ రోజులలో తుది దశకు చేరుకోవటంతో గూగుల్ తన వార్షిక ‘ఇయర్ ఇన్ సెర్చ్’ జాబితాను విడుదల చేసింది, ఎప్పటిలానే ఈ సంవత్సరం 2020 లో భారతదేశంలో గూగుల్‌లో అత్యధికంగా శోధించిన వ్యక్తులను ప్రకటించింది.

Also Read: మహేష్ కోసం హైదరాబద్ లో ‘అమెరికా బ్యాంక్’.. !

1. జో బైడెన్‌

అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు, ఇటీవల జరిగిన ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్‌ను ఓడించటం ద్వారా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా అవతరించాడు. నవంబర్ వరకు, అతని గురించి చాలా మందికి తెలియదు, ట్రంప్ తో అమెరికా ఎన్నికలలో పోటీ చేయటంతో అందరూ ఆయన గురించి సెర్చ్ చేశారు. ఆ సందర్బంగా జరిగిన చర్చలలో అతని పేరు బాగా మారుమ్రోగింది.

2. అర్నాబ్ గోస్వామి

ఆశ్చర్యకరంగా, జో బైడెన్ తర్వాత రెండవ స్థానంలో రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసును నాన్-స్టాప్ కవరేజ్ చేస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వంతో తలపడటం జరిగింది. ఏదేమైనా, గూగుల్ ట్రెండ్స్ ప్రకారం, 2018లో ఒక వ్యక్తిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేపించిన కేసులో పాత్ర ఉన్నందున గోస్వామిని నవంబర్ 4 తెల్లవారుజామున తన ఇంటి నుండి అరెస్టు చేసిన తరువాత ఆయన పేరు నేషనల్ గా ట్రెండ్ అయ్యింది.

3. కనికా కపూర్

కరోనావైరస్ సంక్రమించిన మొదటి భారతీయ ప్రముఖురాలిగా కనికా కపూర్ పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ‘బేబీ డాల్’ పాటతో ప్రసిద్ధి పొందిన ఈ గాయని లండన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత లక్నోలో అగ్రశ్రేణి రాజకీయ నాయకులు మరియు స్నేహితులతో కలిసి కరోనా నిబంధనలను పాటించకుండా పార్టీని నిర్వహించడం ద్వారా ప్రభుత్వ మరియు ప్రజల కొప్పాన్ని చవి చూసింది. కనికాపై నిర్లక్ష్య ధోరణి మరియు ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి చెందే చర్యలకు పాల్పడినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.

Also Read: క్రేజీ బ్యూటీ ‘రష్మిక’ క్రేజీ ప్లానింగ్ !

4. కిమ్ జోంగ్-ఉన్

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్-ఉన్ మరణించాడన్న రూమర్ కారణంగా ఆయన సజీవంగా ఉన్నాడా లేదా చనిపోయాడా అనేది ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా జరిగిన చర్చ. అతని ఆరోగ్యం గురించి ఎటువంటి అధికారక సమాచారం లేకపోవడంతో, భారతీయులు అతని గురించి ఆసక్తిగా గమనించారు, ముఖ్యంగా అతను కోమాలో ఉన్నట్లు వచ్చిన పుకారు సోషల్ మీడియాలో బాగా ట్రేండింగ్ అయ్యింది .

5. అమితాబ్ బచ్చన్

జూలైలో బిగ్ బి తాను కోవిడ్ -19 పాజిటివ్ అని ప్రకటించి తన అభిమానులకు షాక్ ఇచ్చారు. అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ,కోట్లాది అభిమానులు అతని ఆరోగ్యం మెరుగవ్వాలని పూజలు చేయటమేగాక త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అదె సమయంలో అతని కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్య, మనవరాలు ఆరాధ్య కూడా ఈ వైరస్ బారిన పడ్డారు.ఈ సంవత్సరం, అతని చిత్రం ‘గులాబో సీతాబో’ అమెజాన్ ప్రైమ్ మూవీ ద్వారా కూడా వార్తలలో నిలిచారు.

6. రషీద్ ఖాన్

టాప్ 10 జాబితాలో ఉన్న ఏకైక క్రీడాకారుడు ఆఫ్గనిస్తాన్ క్రికెట్ సంచలనం రషీద్ ఖాన్, విరాట్ కోహ్లీ మరియు ఎంఎస్ ధోనిలను కూడా ఓడించి ఈ జాబితాలో నిలిచాడు. దుబాయ్ లో డ్రీమ్ 11 ఐపిఎల్ 2020 లో రషీద్ ప్రదర్శన తర్వాత ప్రజాదరణ బాగా పెరిగింది, అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 16 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు, అతని ఐపిఎల్ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను 3/7 గా నమోదు చేశాడు.

7. రియా చక్రవర్తి

సుశాంత్ సింగ్ రాజపుత్ మరణానంతరం, రియా జాతీయ ముఖ్యాంశాలలో నానుతూ ఉంది. సుశాంత్ కుటుంబం ఆమెపై హత్య కేసును దాఖలు చేసిన తరువాత ఎక్కువగా వైరల్ అయ్యింది. బాలీవుడ్ డ్రగ్ వివాదంలో ఆమె పేరు వచ్చిన తరువాత సోషల్ మీడియాలో మరింత ట్రోల్ చేయబడింది.సుశాంత్‌కు గంజాయి సరఫరా చేసినందుకు చక్రవర్తి అరెస్టు చేయబడింది, ఆమె బెయిల్‌పై విడుదలయ్యే ముందు ముంబైలోని బైకుల్లా జైలులో ఒక నెల పాటు జైలు శిక్షని అనుభవించటం జరిగింది .

Also Read: డే 1 సాలిడ్ వసూళ్లు రాబట్టిన “సోలో బ్రతుకే సో బెటర్”.!

8. కమలా హారిస్

ఆగష్టు 2020 లో కమలా హారిస్ యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ కోసం డెమొక్రాటిక్ పార్టీ తరుఫున నామినేషన్ వేసినప్పుడు, ఈ ఘనత సాధించిన మొదటి నల్ల జాతీయ మహిళగా చరిత్ర సృష్టించారు.హారిస్ తల్లి భారతీయ మూలాలు కలిగిన తమిళరాలు అవటంతో , ఆమె భారతీయ వారసత్వపు విషయం మీద మన దేశం లో ఎక్కువగా చర్చ జరిగినందున ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2020 నవంబర్‌లో హారిస్ అమెరికా ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు, చరిత్రలో మొదటిసారిగా నల్ల జాతీ మహిళ వైట్‌హౌస్‌లో ఆ స్థానానికి ఎన్నికయ్యారు. హారిస్‌ను బైడెన్ తో పాటు టైమ్ మ్యాగజైన్ 2020 ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేశారు.

9. అంకితా లోఖండే

నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం తరువాత, అతని మాజీ ప్రియురాలు అంకితా లోఖండే అతనికి న్యాయం చేయాలని గట్టిగా కోరినప్పుడు ఆమె దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది.‘పవిత్ర రిష్తా’ టీవీ సీరియల్‌తో అంకిత ఎంతో గుర్తింపు సాధించింది.పవిత్ర రిష్తా సీరియల్‌లో సుశాంత్‌తో కలిసి నటించింది.ఈ సమయంలో వారిద్దరు ప్రేమలో పడ్డారని, ఆ తర్వాత వారు విడిపోయారని సమాచారం.ఈ కారణాల వలన ఈమె ఈ సంవత్సర గూగుల్ సెర్చ్ జాబితాలో స్థానం పొందింది.

10. కంగనా రనౌత్

సుశాంత్‌కు న్యాయం చేయాలని కోరిన తొలి నటులలో కంగనా రనౌత్ కూడా ఒకరు, బాలీవుడ్ లో ఉన్న నేపోటిజం కారణంగానే సుశాంత్ కి ఈ పరిస్థితి కలిగిందని, ఆ విషయంలో కొందరి ప్రముఖులను కూడా పేర్కొని తీవ్ర సంచనాలకు దారి వేసింది. ముంబై లో ఉన్న కంగనా ఆఫీస్ ని ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) కూల్చివేసినందున ఆమె మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా తలపడింది. సిఎఎ, రైతుల నిరసనవంటి భారతదేశంలోని దాదాపు ప్రతి సమస్యపై తన వైఖిరిని ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఉండటంతో ఆమె ఎప్పుడు వార్తలలో వివాదాస్పద వ్యక్తిగా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular