
ఒడిశాలోని పూరిజగన్నాథ ఆలయంలో 400 మందికి పైగా కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. వీరిలో 9 మంది చనిపోయారన్నారు. 351 మంది సేవకులు ఉండా 53 మంది సిబ్బంది ఉన్నారన్నారు. భువనేశ్వర్‌లోని కోవిడ్ ఆసుపత్రిలో వీరు చికిత్స పొందుతున్నారని ఆలయ పర్యవేక్షణ అధికారి అజయ్‌కుమార్ జెనా పేర్కొన్నారు. కరోనా సోకి చాలా మంది ఆలయ సిబ్బంది ఇళ్ల దగ్గరే ఉంటూ చికిత్స పొందుతున్నారన్నారు. ఆలయాన్ని తెరవాలని భక్తుల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ విషయాన్ని తెలపడంతో ఆందోలన నెలకొంది. కాగా ఆలయంలో నిత్యం జరిగే పూజలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని భక్తులను మాత్రం ఇప్పుడు అనుమతించమని తెలిపారు.
Also Read: బీజేపీ నేతల మౌనం వెనుక అసలు కథేంటి?